Thursday, 25 June 2026 06:37:19 PM

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరం...

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి డిమాండ్...

Date : 23 September 2024 08:20 PM Views : 372

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు.చంద్రబాబు నాయుడు విజనరి లీడర్... అలాంటి వ్యక్తి ఇంత మంది భక్తులును ఆందోళన కి గురి చేసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావట్లేదని పేర్కొన్నారు.లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు ... ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు దీనితో దేశ విదేశాల్లో వున్న భక్తులు ఇపుడు లడ్డు తినాలా వద్దా అనే ఆందోళన లో వున్నారని పేర్కొన్నారు.తిరుపతి లో స్వామి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం తింటేనే భక్తులు కి తృప్తి.. ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు తిరుపతి వెంకన్న స్వామి అందరివాడు... వైసీపీ టీడీపీ రాజకీయ గొడవల్లో శ్రీవారిని ఆలయాన్ని ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేయకండి మీ రాజకీయాలు కొట్లాటలు వేరే సబ్జెక్టు ల మీద.. వేరే అంశాలు మీద పెట్టుకోండి... అంతే కానీ దేవుడి విషియం లో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు ఏం జరిగిందో తక్షణమే విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు హిందువుల మనోభావాలను కాపాడాలని సూచించారు తక్షణం దీని మీద విచారణ చేసి దోషులని శిక్షంచాలని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు. ఈ విషయం లో రాజకీయాలు మానేయండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు విశిష్టతను కాపాడటంపై అధికార టిడిపి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏపీలోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :