Saturday, 07 December 2024 02:42:56 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు...

Date : 23 January 2024 08:24 PM Views : 3483

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేతలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం విస్తుపోయే సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. బీఅర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) మాణిక్ రావు (జహీరాబాద్) రేవంత్ రెడ్డిని హైదారాబాద్ లోని అయన నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ విషయం బయటకు తెలియగానే అగ్రనాయకులు సహా ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా సుమ ఆలోచనలో పడ్డాట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నలుగురు ఎమ్మెల్యేల మాదిరిగానే మరికొంత మంది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోలేదని సమాచారం. 2014లో టీఅర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి వాతావరణమే కనిపించిందని పలువురు రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :