Friday, 25 September 2026 06:07:19 PM

అనుచరులు జైల్లో...అసలు సూత్రధారి ఇంట్లో

ఎంఎల్ఎ కోరుకంటి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సోమారపు

Date : 28 December 2022 08:22 PM Views : 671

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తన అనుచరులను జైలుకు పంపించి... అసలు సూత్రధారి ఇంట్లో ఉంటున్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంఎల్ఎ సోమారపు సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివాజీ నగర్ లోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగ దందాలో కీలక పాత్ర పోషించిన ప్రధాన సూత్రధారి, కర్త కర్మ క్రియ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నమ్ముకున్న వారిని జైలుకు పంపించిన చరిత్ర తనది అంటూ విమర్శించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అలాగే సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణిని ప్రైవేటుపరం చేయమని స్పష్టంగా తెలియజేశారని అయినా కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దీక్షల పేరుతో కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదమన్నారు. బిజెపి పార్టీని, ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే ది కాదని నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వాఖ్యానించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం అవివేకమని చదువుకున్న వ్యక్తిల మాట్లాడాలని అన్నారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణి ప్రైవేటుపరంపై వివరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ప్రైవేట్ పరం చేసిన నాలుగు బొగ్గు గనులు రామగుండం నియోజకవర్గం కిందికి రావని అక్కడి ఎమ్మెల్యేనే స్పందించకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోసారి బిజెపి పై కాని ప్రధానమంత్రిపై కానీ నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఒక చదువుకున్న వ్యక్తిల మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యలపై బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాతంగి రేణుక సోమారపు లావణ్య అరుణ్, వడ్డేపల్లి రామచంద్రం గుండబోయిన లక్ష్మన్, పిడుగు కృష్ణ, దుబాషి మల్లేష్ రాచకొండ కోటేశ్వర్లు, బొయినా మల్లేశ్, సునీల్, మాడ నారాయణరెడ్డి, పత్తి సంజీవ్, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి సతిష్ ,డేవిడ్ రాజ్, మంచికట్ల బిక్షపతి, సంపంగి శ్రీనివాస, సాగి కిషన్రావు, గండ్ల స్వరూప, వాసు, మహెష్ ,సాగర్, తదితరుల పాల్గోన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :