Saturday, 26 September 2026 08:05:43 PM

ఈటెల రాజేందర్ ను కలిసిన కందుల సంధ్యారాణి

Date : 05 November 2023 01:14 PM Views : 774

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి హైదరాబాద్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ రామగుండం ప్రచారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామగుండంలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఇలాగే కొనసాగితే రామగుండంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తు సంధ్యారాణిని ఈటెల రాజేందర్ అభినందించారు. మీ గెలుపు కోసం నా వంతు సహకారం అందించి కృషి చేస్తామని ఈటెల రాజేందర్ చెప్పడంతో ఆయనకు సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :