Monday, 10 August 2026 06:39:38 PM

వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సన్మానం చేసిన కందుల సంధ్యారాణి

Date : 13 June 2024 03:19 PM Views : 671

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పాఠశాలలు పునః ప్రారంభం అయిన వేళ పాఠశాలలను సందర్శిస్తున్న బీజేపీ ఇంఛార్జి కందుల సంధ్యారాణి. ఈరోజు లింగాపూర్ లోని మోడల్ స్కూల్, పొట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడ పిల్లల సంఖ్య, వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఈ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా పాఠశాలల హెడ్ మాస్టర్ తార తస్నీమ్, సంగీత లను సన్మానించి, మెమొంటో ను బహుకరించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయం అన్నారు. ఈ ఫలితాల వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుంది అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీస అనిత, హరీష్, బీజేపీ కో ఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్, సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్, పైతరి రాజు, వినయ్, బరుపాటి నారాయణ, శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీధర్, తిరుపతి, లక్ష్మయ్య, రాజ నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :