ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రెప్పపాటు జీవితంలో ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధించి అభివృద్ధికి కృషి చేస్తున్న చీకటి సూర్యుల ప్రాణాలకు విలువ ఇవ్వని కొందరు అధికారులు, యూనియన్ నాయకులు టార్గెట్ పేరుతో చేసుకుంటున్న విందులు చర్చనీయాంశంగా మారుతుంది. ఓవైపు సింగరేణి వ్యాప్తంగా కొన్నిచోట్ల కార్మికులు పనిచేసే స్థలాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కోకొల్లోలుగా ఉన్న నేపథ్యంలో కొందరు అధికార వర్గానికి చెందిన యూనియన్ నాయకులు ఈ విందులో పాల్గొని ముందు అడుగు వేసి పార్టీ ఏర్పాటు చేయడం పట్ల వివాదాస్పదంగా మారుతుంది. కార్మికుల సమస్యలపై స్పందించని సదురు నాయకులు ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తూ కార్మికుల రక్షణను గాలికి వదిలేస్తున్న సదురు కొందరు కార్మిక సంఘం నాయకులపై స్పందించాల్సిన అధికారులు సైతం ఈ విందు పార్టీలో ఉండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే ఇందులో ఉన్న కొందరు నాయకులపై ఎన్నో ఆరోపణలు ఉన్నా అధికార యంత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కార్మికుల రక్షణ మీద దృష్టి సాధించాల్సిందిపోయి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Admin
Aakanksha News