Saturday, 07 December 2024 02:03:17 PM

నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి....

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 28 November 2024 05:49 PM Views : 133

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం మంథని మండలంలోని నాగారం పి.పి.సి,కన్నాల పి.పి.సి ,గుంజపడుగు పి.పి. సి, జడ్పీ హెచ్ఎస్ స్కూల్ , చిల్లపల్లి ఐ .కే. పి. గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమ శాతం 17 రాగానే వెంటనే కాంట వేసి, సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించే లా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కన్నాల, గుంజపడుగు గ్రామాలలోని సెంటర్ లను ఈరోజు సాయంత్రం లోపు లిఫ్ట్ చేయాలనీ, వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే పంపాలని ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలన్నారు. గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యమైన పదార్థాలు మాత్రమే వాడాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ఉన్న సరుకులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలని, పాఠశాలకు సరుకులు వచ్చే సమయంలో నాణ్యతను పరిశీలించి స్వీకరించాలన్నారు. పిల్లలకు అందించే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అగ్రికల్చర్ ఏ.డి.అంజనీ, సిబ్బంది నరేష్, పద్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :