Saturday, 08 August 2026 07:13:00 AM

అనుమతి లేని ఫ్లెక్సీ హోర్డింగులను తొలగించాలి.

మున్సిపల్ కమిషనర్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వినతిపత్రం

Date : 14 September 2023 03:56 PM Views : 632

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనుమతిలేని ఫ్లెక్సీ హోర్డింగులను తొలగించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందజేశారు.ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ..రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని వందల సంఖ్యలో అనుమతి లేకుండా కొందరు ఫ్లెక్సీ హోర్డింగులను ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. హై వోల్టేజ్ కరెంటు వైర్ల కింద ఉన్నటువంటి హోర్డింగుల వల్ల గతంలో ఒకరు మృత్యువాత పడ్డారని అలాంటి వాటిని కూడా తొలగించి, వేరే ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చూడాలని పేర్కొన్నారు.అదే విధంగా రోడ్లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసే హోర్డింగుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, పై విషయాలన్నీ ఒక వినతి పత్రంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి వాటిపై పూర్తి విచారణ చేసి, అవసరమగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు.ఈ వినతి పత్రం అందజేసిన వారిలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండి. ముస్తఫా, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్లపెల్లి యుగేంధర్, రామగుండం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, యువజన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు కుడిదెల శివ, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు దాసరి విజయ్, డివిజన్ అధ్యక్షులు సిరిపురం మహేష్, బీసీ సెల్ నాయకులు రాపెళ్ళి కార్తీక్, నాయకులు ఓంకార్, లతో పాటు తదితరులున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :