Saturday, 07 December 2024 03:03:49 PM

6 మోసాలు, 66 అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీ...

ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా... బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ సవాల్

Date : 28 November 2024 07:34 AM Views : 533

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాలన-పరిపాలన తీరులో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీది ఒకే పంథా కొనసాగిస్తూ, కేవలం ప్రజలను నమ్మించేందుకు విమర్శలు-ప్రతివిమర్శలకు పరిమితమవుతున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో K-TAX వసూళ్లకు పాల్పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం R-TAX వసూళ్లు చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీకి ఎడమ కన్ను కేసీఆర్ అయితే.. కుడికన్ను రేవంత్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాడు మియాపూర్ భూముల వ్యవహారం, మూసీ సుందరీకరణ, ప్రాజెక్టులకు భూసేకరణ, పార్టీ ఫిరాయింపులు, డ్రగ్స్ కేసుల్లో విమర్శలకు మాత్రమే పరిమితమై, ప్రజలను మోసం చేసేలా బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కాలం వెల్లదీస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆలోచన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. అప్పుడు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పాలన చేస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆదానీకి సంబంధించిన డొనేషన్ ను తిరస్కరించామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కారకులైన కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న డొనేషన్లను రేవంత్ రెడ్డి ఎందుకు వాపస్ ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్లాది రూపాయల దండుకున్న ఆక్రమణదారులు, బిల్డర్ల నుంచి వచ్చిన విరాళాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా 6 మోసాలు, 66 అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీ అసమర్థతను, వైఫల్యాల పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటే.. బీర్లు అమ్ముకోవడం.. భూములు అమ్ముకోవడం. కూలగొట్టడం.. కొల్లగొట్టడం. దోచుకోవడం.. దాచుకోవడమేనంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.మేమే అధికార పార్టీ అన్నట్లుగా కాంగ్రెస్.. మేమే ప్రతిపక్ష పార్టీ అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ తొలి ఏడాది పరిపాలించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు.. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది చేసిన పనులు, నిర్వహణ అంశాలు పరిశీలిస్తే.. బీఆర్ఎస్ అడుగుల్లో, ఆలోచనల్లోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్లుగా ప్రతి సంఘటనలో కనపడుతున్నదన్నారు..నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వే చేస్తే...నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన అంటున్నది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై విచారణ జరిపించి, దోషులను జైలుకు తరలిస్తామని చెప్పింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులను వదలిపెట్టేది లేదంటూ ప్రకటించారన్నారు..ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అక్రమాల్లో దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని గత సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. కాళేశ్వరం కుంగింది.. కారకులెవ్వరో తెలిసింది.. కాంట్రాక్టర్లను వదలిపెట్టం.. విచారణ జరిపించి మంత్రులు, ముఖ్యమంత్రులెవ్వరినైనా వదిలిపెట్టమని రేవంత్ రెడ్డి మాట్లాడారు.డ్రగ్స్ మాఫియా, మియాపూర్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరును ప్రదర్శిస్తున్నది. డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల వ్యవహారం, ఓటుకు నోటు కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ సంఘాలు నత్తనడకన నడూస్తూ కాలం వెల్లదీస్తూ దాటవేసే ధోరణిలో వెళ్తున్నాయి.రాష్ట్రంలో అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ పంథాలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు..నాడు కేసీఆర్.. మూసీ సుందరీకరణ చేసి.. ట్యాంక్ బండ్ ను కొబ్బరినీళ్లలా నింపుతామంటే.. నేడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఫిరాయించి, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. పాలన-పరిపాలన పరంగా చూస్తే మొత్తంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఒకే పంథా.అయితే, బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి.గతంలో లక్ష రూపాయల మేరకు రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబితే.. రూ. 2 లక్షల రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఒట్టు మీద ఒట్టుపెట్టి గట్టెక్కేలా వ్యవహారం నడిపారు.రాష్ట్రంలో ఒక్క గ్రామంలో అయినా కనీసం ఒక్క రైతుకైనా బ్యాంకు నుంచి రుణవిముక్తుడు అయ్యాడని ప్రకటించిన దాఖలాలు లేవు. ప్రజల నుంచి భూసేకరణ విషయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఒకే తీరు.ఆదానీకి సంబంధించిన డొనేషన్ ను తిరస్కరించామని రేవంత్ రెడ్డి చెబుతుంటే.. ఒప్పందాల గురించి బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.తెలంగాణ ఖజానాతో నిర్మించిన కాళేశ్వరం కుంగడానికి కారకులైన కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న డొనేషన్లను రేవంత్ రెడ్డి ఎందుకు వాపస్ ఇవ్వలేదు..?చెరువులను ఆక్రమించి, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్లాది రూపాయల దండుకున్న ఆక్రమణదారులు, బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన డొనేషన్లను తిరిగి ఎందుకు ఇవ్వలేదు..?కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విషపూరిత ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, కుట్రలను ఎండగడుతాం. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల బండారాన్ని బట్టబయలు చేస్తాం.6 మోసాలు, 66 అబద్ధాలతో కాలం వెలిబుచ్చుదామనుకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పాలన- పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా..? స్పష్టం చేయాలని ప్రబాకర్ డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :