ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఆటోనగర్,మొబిన్ నగర్ కాలనీలలోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలకి ఇబ్బంది కరంగా మారిందని పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు సంధ్యారాణి మాట్లాడుతూ..బి థర్మల్ యాష్ ప్లాంట్ కట్ట తెగడంతో కాలనీ వాసులకి ఇబ్బంది తలెత్తిందంటూ కాలనీ వాసులు వాపొతున్నారని అన్నారు. ఇండ్లు కాలి చేసి పునరావాస ప్రాంతాలకి తరలివెల్లాల్సిన పరిస్థితి ఎర్పడిందన్నారు.తినడానికి తిండి ఎర్పాటు చేసుకోలేని పరిస్థితి లో కాలనీ ప్రజలు ఉండగా బీఆర్ఎస్ నాయకురాలు కందుల సంధ్యారాణి వారికి ఉదయం అల్పాహరం ఎర్పాటు చేసి అందజేసారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులకి సమాచారం అందించి బాధిత కుటుంబాలకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన నష్ట పరిహరం అందజేయాలని కోరారు.అనంతరం కాలనీ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు.అధైర్య పడవద్దని భాధితులకి అండగా ఉంటామన్నారు.
Admin
Aakanksha News