Monday, 10 August 2026 03:29:01 PM

నలుగురికి ఆదర్శంగా పుట్టినరోజు వేడుకలు...

అమ్మ పరివార్ ఆశ్రమంలో అన్నదానం

Date : 05 October 2023 05:56 PM Views : 513

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మానవసేవయే మాధవసేవా అని సీనియర్ జర్నలిస్టు జేమ్స్ రెడ్డి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి మాతృమూర్తి దాట్ల సరస్వతి రిటైర్డ్ సింగరేణి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ అనాధ పిల్లల ఆశ్రమంలో అనాధ వృద్ధులకు వికలాంగులకు అనాధ పిల్లలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ పోలీస్ అధికారి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా అనాధ పిల్లల మధ్య వృద్ధుల జేమ్స్ రెడ్డి తల్లి సరస్వతమ్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల జేమ్స్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి సేవా గుణానికి ఇది నిదర్శనమని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు శ్రేయోభిలాషులు జర్నలిస్టులు జెళ్ళ వీరేశం, వి ఎన్ చారి, పూసాల శ్రీధర్, పెనగొండ సతీష్, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :