Tuesday, 11 August 2026 03:44:41 PM

మహిళలపై కేంద్ర ప్రభుత్వ పాసిస్టు, మనువాద దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం!

మహిళా దినోత్సవ కరపత్రం ఆవిష్కరణలో POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి పిలుపు.

Date : 03 March 2023 01:30 PM Views : 392

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనిలో POW ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు మహిళా కార్మికుల దగ్గర మహిళా దినోత్సవం సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి హాజరై మాట్లాడుతూ.. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావం జరిగి సరిగ్గా 112 సంవత్సరాలు అయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆశాస్త్రీయ అమానవీయ విధానాలకు, అప్రజా సామెత దోరణలకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు గౌరీ లంకేష్ లాంటి మేధావులను ఎందరినో ఈ పాసిస్టు ముఠా హత్య చేసిందని పేర్కొన్నారు. గో రక్షణ పేరుతో దాడులకు హత్యలకు పూనుకుంటున్నదని విమర్శించారు. సైన్స్ స్థానంలో అశాస్త్రీయ భావాలను జ్యోతిష్య శాస్త్రాన్ని మనవాద భావజాలాన్ని ప్రవేశపెడుతున్నదని. దళితులపై మైనారిటీలపై జరుగుతున్న దాడులు హత్యలు పాసిస్టు చర్యల్లో భాగమే అని ఆరోపించారు. అందుకే ముంచుకొస్తున్న ప్రమాదాలపై ప్రజలు ప్రజాసామిక వాదులు అందరూ ప్రత్యేకించి మహిళలు గళం విప్పాలని. పిడికిలి బిగించాలి పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అందించిన స్ఫూర్తితో, ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం సాధించిన ఉద్యమ విజయం ప్రేరణతో మహిళలు ఉద్యమ బావుట ఎగర వేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద మనువాద విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత సమైక్య ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్షురాలు కొట్టే స్వరూప, మార్త రాధ,కల్పన, సాయక్క దీక్షా కుమారి, రాజేశ్వరి, మమత, దుర్గ, శారద, లక్ష్మీ ,స్వరూప, పోచమ్మ, మంగ, మీనా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :