Friday, 11 July 2025 04:26:28 AM

బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మ దగ్ధం

Date : 11 March 2023 08:06 PM Views : 261

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మహిళా లోకాన్ని కించపరచడమేనని రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ధ్వజమెత్తారు. కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నూనె లతామోహన్, ముద్దసాని సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, వారికి పెద్దపీట వేస్తున్నారన్నారు. కానీ ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే బిజెపి, మహిళలపై విషం చిమ్మే విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ బహిరంగంగా బేషరతుగా ఎమ్మెల్సీ కవితకి క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ మహిళా లోకం ఏకతాటి పైకి వచ్చి ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు శాంత లక్ష్మి, గోలివాడ చంద్రకళ, తోడేటి స్వరూప, స్వాతి, సీత, గుర్రం పద్మ, కేతమ్మ, మేకల సరోజన, నాగమణి, బండారి రాధ, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప-రామస్వామి, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, అడ్డాల గట్టయ్య, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, దీటి బాలరాజు, పిఎస్ అమరేందర్, ఎన్.మురళీధర్ రావు, అచ్చ వేణు, నూతి తిరుపతి, మేకల పోశం, మేడి సదయ్య, పిల్లి రమేష్, దాసరి ఎల్లయ్య, అడప శ్రీనివాస్, చిప్ప రాజేశం, గుంపుల ఓదెలు యాదవ్, హాఫిజ్, వడ్డేపల్లి శంకర్, పుట్ట రమేష్, శేషగిరి, జడ్సన్, ముడుతనపెళ్లి సారయ్య, భీముని కేశవ్ గౌడ్, కారం వినయ్, అల్లం ఐలయ్య, మారేడుపాక రవి, బసవరాజు గంగరాజు, కోడి రామకృష్ణ, అబ్బాస్, చింటూ, శ్రావణ్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :