Monday, 10 August 2026 04:55:25 PM

స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోండి..

అర్జీ-1 జీయం చింతల శ్రీనివాస్...

Date : 15 February 2024 12:56 PM Views : 509

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో త్వరలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అర్జీ-1 ఏరియా జీయం చింతల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మంచిర్యాల,ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ప్రాంతాల యువతి యువకులు ఈ శిక్షణకు అర్హులని ఆయన తెలిపారు.సింగరేణి పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, తెలంగాణ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ పెన్యుర్షిప్ సహకారంతో మొత్తం 08 వృత్తి కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.ఇందులో కాస్మోటాలజీ (మహిళలు), డ్రోన్ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, సెల్ టెక్నీషియన్, టూవీలర్ మెకానిక్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, కంప్యూటర్ డిటిపి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సులపై ఉంటుందని, కాస్మోటాలజీ కోర్సుకు ఏలాంటి విద్యా అర్హత అవసరం లేదని, ఇతర కోర్సులకు డిగ్రీ, డిప్లామా, ఐటిఐ, పదవ తరగతి పాసై ఉండాలన్నారు. ఒక్కొక్క బ్యాచ్ కు 20 మందికి శిక్షణ ఇవ్వబడుతుందని, బెల్లంపల్లి, రామగుండం సింగరేణి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం-1,2,3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాలకు చెందిన 18 నుండి 42 ఏళ్ల వయసున్న యువతి యువకులు తమ దరఖాస్తులను సమీప ఎంవీటీసీ నందు నేరుగా సమర్పించాలని తెలియజేశారు.ఈ అవకాశాన్ని గోదావరిఖని, రామగుండం ఏరియా -1 పరిసర ప్రాంతాల యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం ఒక ప్రకటనలో తెలియజేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :