ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ నెంబర్ వన్ జూనియర్ టెన్నిస్ ప్లేయర్ రిషితా రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సన్మానించారు. తన అద్భుతం మైన ప్రతిభతో రాణిస్తూ, అతి తిన్న వయసులోనే మూడు అంతర్జాతీయ జూనియర్ టైటిల్స్ నెగ్గి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నందుకు ఆయన రిషితారెడ్డిని అభినందించారు. రేపటినుండి సింగపూర్ లో ప్రారంభం కానున్న ఐ సి రాడ్ లేవర్ కప్ కు ఇండియా టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషితా రెడ్డి ఈరోజు సింగపూర్ కు బయలుదేరి వెళ్లింది. రిషితా రెడ్డి ఇండియా జూనియర్ టెన్నిస్ విభాగంలో నెంబర్ 3 ర్యాంకులో కొనసాగుతుండగా, అంతర్జాతీయ స్థాయిలో 108వ ర్యాంకులో కొనసాగుతుంది. రిషితా రెడ్డికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుందన్న విశ్వాసాన్ని శివసేన రెడ్డి వ్యక్తం చేశారు
Admin
Aakanksha News