ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సంధ్య టాకీస్ లో జరిగిన దుర్ఘటన బాధాకరమని శివసేన ఉద్దవ్ తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏ సుదర్శన్ పేర్కొన్నారు. పుష్ప- 2 ప్రీమియర్ షోలో రాత్రి జరిగిన ఘటనలో తొక్కిసలాటల ఘటనలో ఒక మహిళ ఒక బాబు చనిపోయారన్నారు.పెర్మియర్ షో లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకునప్పటికి డిజేలు పెట్టి భారి లైటింగ్స్ తో నానా హన్ఘమ చేసారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ షో కు సినిమా హీరో అల్లు అర్జున్ రావడం అభిమానులు విరుచుకపడటం తో తొక్కిసలాటలో తల్లి కొడుకు చనిపోయారన్నారు.దీనికి అల్లు అర్జున్ నైతిక బాద్యత వహించాలని సుదర్శన్ డిమాండ్ చేసారు. థియేటర్ ఓనర్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ హీరో అల్లు అర్జున్లను వెంటనే అరెస్ట్ చేయాలని,అలాగే సంధ్య టాకీస్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేసారు. ఘటన జరిగి దాదాపు 20 గంటలు గడుస్తున్నప్పటి కి అల్లు అర్జున్ స్పందించక పోవడం అతని హహన్కారానికి నినిదర్శనమని విమర్శించారు.మృతులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సుదర్శన్ డిమాండ్ చేసారు.
Admin
Aakanksha News