ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, తెలివి ఉంటే బండ మీద కూడా నూకలు పుట్టించుకోవచ్చన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రశంసించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదని, మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటుందని, కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీయడంలేదని అడిగారు. 2021-22 ముందు జిఎస్‌టి ఆదాయం రూ.34 వేల కోట్లు ఉండగా అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నామని వివరించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు, మూడో అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.నియోజక వర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. అన్ని రంగాల్లో దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని తెలంగాణ నమోదు చేసిందని కొనియాడారు.
Admin
Aakanksha News