ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : మంథని మండలం ఖానాపూర్ నుంచి ఎల్ మడుగు వరకు నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మూలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని అన్నారు. మంథని పట్టణానికి త్వరలోనే బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ. 7 కోట్లతో ఖానాపూర్ నుంచి ఎల్ మడుగు డబల్ రోడ్డు నిర్మాణం పనులు నిర్ణీత సమయంలో జరిగేలా అధికారుల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News