ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇప్పటివరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీలో ఉంటుందా.. లేదా... అనే సందేహాలు అందరిలోని వ్యక్తం కావడంతో ఇప్పటికే నాయకులు, కేడర్ లో అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్లీ నూతన ఉత్సాహం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుల్లో నెలకొంది. ఈ సారీ జరిగే సింగరేణి ఎన్నికల్లో TBGKS పోటీలో ఉంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నాయకులకు ఫోన్ లో సమాచారం అందినట్లు తెలుస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న యువ కార్మికులకు పోటీలో నిలిపి యువ నాయకత్వాన్ని బలపరచాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే యూనియన్ కు సంబంధించిన ఓ అగ్రనేత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మరి కాసేపట్లో సమావేశం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అంతే కాకుండా సదరు అగ్ర నాయకుడికి పూర్తి స్థాయిలో యూనియన్ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే TBGKSకు రాజీనామా చేసిన మరో అగ్రనేత కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం కన్నునట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Admin
Aakanksha News