Tuesday, 11 August 2026 04:45:50 PM

అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం...

రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదు.. యధావిధిగా అద్దె బస్సులు

Date : 04 January 2024 05:35 PM Views : 891

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అద్దె బస్సుఓనర్లతో చర్చలుసఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్తెలిపారు. గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు.రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్‌ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపమని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :