ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ బంద్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడితో తప్పుల తడకగా బీసీ బంద్ అమలు జరిగిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఓ డివిజన్ కార్పొరేటర్ భర్తకు బీసీ బంద్ రావడం సంచలనం సృష్టిస్తుంది. ఓ వైపు డివిజన్ లో ఎంతో మంది నీరు పేద ప్రజలు తమ అవసరాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంద్ కు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకుండా ఎఫ్ సీ ఐ లో పనిచేస్తున్న ఓ కార్పొరేటర్ భర్తకు బీసీ బంద్ రావడం పట్ల స్థానిక నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే సదురు కార్పొరేటర్ భర్తకు కార్పొరేట్ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తికి ధ్రువీకరణ పత్రం ఏ విధంగా జారి అయిందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే కాకుండా మరి కొన్ని డివిజన్ లో కూడా ఇదే తంతు జరిగినట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News