Thursday, 24 September 2026 09:31:38 PM

దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోంది...

కేటీఆర్ పై ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్ ఫైర్

Date : 23 November 2024 08:42 PM Views : 427

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందని కేటీఆర్ పై ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్ ఫైర్ ఐనారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి అవార్డు వస్తే కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.డ్రగ్స్ వల్లనో, తాగడం వల్లనో కానీ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే మా ప్రభుత్వం తరపున వైద్యం చెపిస్తాం కేటీఆర్ మాటలకి మత్స్యకారులు నవ్వుతున్నారు అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి కేటీఆర్దాచేసిన సత్యం అంటూ అసలు సత్యాన్ని కేటీఆర్ దాచేసారన్నారు.కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా?అబద్దాల విషయంలో కేటీఆర్ హరీష్ రావుతో పోటీ పడుతున్నారుకేసీఆర్ అబద్దాల రికార్డు బ్రేక్ చేసేందుకు కేటీఆర్ కష్టపడుతున్నాడు,మా హాయాంలో చేసిన పనిని కేంద్రం గుర్తిస్తే అది తమ ఘనత అంటూ కేటీఆర్ చెప్పుకుంటున్నారుఇందిరా మహిళా శక్తికి అవార్డు వచ్చింది. అది ఎవరిదో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మహిళాభివృదికి పథకం తీసుకొస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా?బిఆర్ఎస్ హాయాంలో మహిళలకి ఇచ్చిన సబ్సిడీని మేం పెంచాం 2మొబైల్ ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించాం రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలకు మాకు అవార్డు వచ్చిందిభీమా పధకం ద్వారా 4 లక్షల 16 మంది సభ్యుల జీవితాలు కాపాడేందుకు139 కోట్లు ప్రీమియం చెల్లించినందుకు అవార్డు వచ్చిందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :