ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని IFTU కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం బొగ్గు గనుల మీద ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆషాడ మాసంలో బొగ్గు గని కార్మికులంతా గత 130 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ వారిగా సామూహిక భోజనాలు వండుకొని దావతులు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని కానీ సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం బావుల మీద వంటలు వండవద్దని దావతులు చేసుకోవద్దని ప్రత్యేకంగా సర్కులర్ ను జారీ చేయడం సరైంది కాదని ఆయన తెలిపారు. దానికి కోడ్ ఆఫ్ డిసిప్లేన్ అడ్డం పెట్టుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. వెంటనే సింగరేణి యాజమాన్యం కార్మికులను అవమానపరిచే విధంగా విడుదల చేసిన సర్కులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోడ్ ఆఫ్ డిసిప్లేన్ పేరుతో సింగరేణి యాజమాన్యం కార్మికులపై అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోకముందే తక్షణమే యాజమాన్యం జారీ చేసిన నిరంకుశ సర్కిలర్ ను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో IFTU నాయకులు పి రాజేందర్, ఏ సారయ్య, నగునూరు పోషం, ఎం వాసుదేవరెడ్డి, మాట్ల సమ్మయ్య, కొయ్యడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News