Tuesday, 11 August 2026 03:46:24 PM

తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం...

ఫేక్ ఐడితో దొరికిన ఓ వ్యక్తి ..పోలీసుల అరెస్ట్

Date : 30 January 2025 04:55 PM Views : 519

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం బయటపడింది. సచివాలయంలో ఫేక్ ఐడితో ఓ వ్యక్తి దొరికాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ సదరు వ్యక్తి బిల్డప్ ఇస్తున్నాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఒ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా ఉంచి పట్టుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్నాడు. భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ రవిలు ఫేక్ ఐడీ కార్డు తయారు చేసి భాస్కర్ రావు ఇచ్చినట్లు ఎస్పిఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :