Friday, 25 September 2026 10:40:48 PM

అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులుగా కాకునూరి బ్రహ్మ చారి నియామకం...

Date : 29 December 2024 04:06 PM Views : 527

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుండి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులుగా కాకునూరి బ్రహ్మచారిని ఎంపిక చేశారు. ఈ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిపెద్ది వేణుగోపాల చారి చేతుల మీదుగా బ్రహ్మచారికి నియామక పత్రంను అందించారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ కి ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. రాష్ట్ర కమిటీ నమ్మకాన్ని నిల బెడుతూ విశ్వ కర్మల అభి వృద్ధి కి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో అ సంఘటిత కార్మిక శాఖ విశ్వకర్మ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,చింతోజు చెన్నయ్యా చారి, బొడ్డుపల్లి చరణ్,విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షురాలు తేజస్విని, జనసేన పార్టీ లింగంపల్లి కన్వీనర్ దంతోజు ఇందుమతి ,దేవపూజ ఈశ్వర చారి,నారోజు నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :