Saturday, 08 August 2026 06:48:58 AM

గోదావరిఖనిలో ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ప్రారంభం

రామగుండం రాజకీయాలపై నిఘా విభాగం ఫోకస్

Date : 15 July 2023 11:15 AM Views : 1336

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో ఆశావాహులు తలపెట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను ఆశావహులు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా వరకు ఉపాదయాత్ర చేరుకొని అక్కడ అమరవీరుల స్థూపంతోపాటు కేసీఆర్ చిత్రపాటానికి పాలాభిషేకం నిర్వహించి మేయర్ సారథ్యం వహిస్తున్న 30వ డివిజన్ నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే ఈ పాదయాత్ర నిర్వహించడంపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం అందుతుంది. మేయర్ డివిజన్ లో పాదయాత్ర నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని ఈ పాదయాత్రను నిర్వహించవద్దని పోలీసుల నుండి పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణికి ఫోన్ కాల్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఎట్టి పరిస్థితిలోనూ పాదయాత్రను ఆపేది లేదని ఈరోజు మేయర్ కు సంబంధించిన 30వ డివిజన్ లో పాదయాత్ర నిర్వహించి ఆదివారం కోర్ కంటి చందర్ డివిజన్ లో ఈ పాదయాత్రను కొనసాగిస్తామని వారు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :