ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక గోదావరిఖని కి చెందిన న్యాయవాది పులిపాక రాజ్ కుమార్ పేరును డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు Dr విశారదన్ ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజ్ కుమార్ డాక్టర్ విశారదన్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. బిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి పార్టీలు స్థానిక కొంత మంది నాయకులు ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రజలని మోసం చేస్తూ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను ఇవ్వడమే పనిగా పెట్టుకొని వస్తున్నటువంటి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. యువత రాజకీయాలలో ముందుండాలని దేశ భవిష్యత్ విద్యార్థులు యువకుల చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తనకు మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో యువకుడైన నాకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు -
Admin
Aakanksha News