Thursday, 24 September 2026 03:35:51 PM

పోలీసులు దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టివేత

Date : 27 April 2023 10:08 PM Views : 532

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : బండి సంజయ్ బెయిల్‌ రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. బండి సంజయ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో సూచించిన నియమాలు, నిబంధనలు బండి సంజయ్ ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. విచారణకు సహకరించడం లేదని, ఫోన్‌ కూడా ఇవ్వలేదని కోర్టుకు నివేదించారు. అయితే ప్రాసిక్యూషన్‌ వాదనలతో విబేధించారు మెజిస్ట్రేట్‌. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు ఏప్రిల్ 6న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :