ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే... చంద్రశేఖర్ నగర్ కు చెందిన సతీష్ అనే యువకుడు గోదావరిఖని నుండి తన దిచక్ర వాహనంపై సుల్తానాబాద్ కు వెళ్తుండగా కట్నపల్లి వద్ద కారును డీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు 108కు సమాచారం అందించడంతో వెంటనే 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు
Admin
Aakanksha News