ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పునిర్మల జయప్రకాశ్ రెడ్డిని కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరిసత్యనారాయణ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని స్వాతంత్ర మరయోధుల ఆశయాలను నెరవేర్చుటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధించుటకై పలు కీలకమైన విషయాలను తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పునిర్మల జయప్రకాశ్ రెడ్డి తో చర్చించడం జరిగిందని కోవూరిసత్యనారాయణ గౌడ్ తెలిపారు.అదేవిధంగా తెలంగాణ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి కి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరియు నాయకులకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, పిరమిడ్ ధ్యాన ప్రచారకులు దత్తు మాస్టర్, పీపుల్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ నిర్మల రాణి మరియు వివిధ జిల్లాల ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News