Sunday, 27 September 2026 01:35:47 AM

ఉద్యోగుల పదవి విరమణ వయస్సుపెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి...

జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఆర్ కృష్ణయ్య డిమాండ్

Date : 21 January 2025 08:52 PM Views : 635

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలు, 63 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తూనట్లు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనకు వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ప్రెస్ క్లబ్ లో తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన వివిద నిరుద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిరుద్యోగుల సమస్యలపై తీవ్ర చర్చ జరిపారు. ఈ చర్చలలో నిరుద్యోగా సంఘర్షణ సమితి, నిరుద్యోగ యువజన సంఘం, నిరుద్యోగ పోరాట కమిటీ, బి.సి యువజన సంఘం, వివిద యువజన సంఘాలు పాల్గొన్నారు. భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని చర్చించారు. ఈ సమావేశానికి అర.కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. రిటీర్మెంట్ వయసు పెంచాలని ఏ ఉద్యోగ సంఘం కోరడం లేదు. ఏ ఉద్యోగి కోరలేదు. రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కోరలేదు. ఏకపక్షంగా ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు అన్నారు. వయోపరిమితి పెంచరాదని ఉద్యోగులు కోరుతున్నారు. హాయిగా రిటైర్ అయ్యి ప్రశాంత జీవితం గడపాలని ఉద్యోగులు కోరుతుంటే ప్రభుత్వం ఎలా ఏక పక్షంగా పెంచడం తగదన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం లేక 16 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారు. ఇంకా విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు.గతంలో 58 యుంటే 61కి పెంచారు. అదే పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు పెంచి నిరుద్యోగుల పోట్టరాదన్నారు. ఈ సమావేశం లో అంజి, వేముల రామకృష్ణ, మోదిరామ్దావ్ ,సుగుణ చెరుకుల,అరవింద్,నందగోపాల్, జయంతి ,బాలాస్వామి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :