Monday, 10 August 2026 05:37:34 PM

సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్‌ స్లాబ్ కుప్పకూలడంతో ఇద్దరు మృతి...

Date : 30 January 2025 04:47 PM Views : 465

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / అంతర్జాతీయం : సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్‌ స్లాబ్ కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పన్నా జిల్లాలోని జేకే సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్‌లోని యూనిట్‌లో ఓ నిర్మాణం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ప్లాంట్‌లోని ఒక విభాగంలో సీలింగ్ స్లాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సమయంలో పలువురు కార్మికులపై సెంటర్ ప్రాంతం కూలిపోయింది. దీంతో శిథిలాల క్రింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలువురు బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :