Monday, 10 August 2026 04:10:48 PM

మాలల సింహాగర్జన విజయవంతం చేయండి....

మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కన్వీనర్ కడారి కుమార్,కో కన్వీనర్ సాధు నర్సింగరావు

Date : 23 November 2024 04:41 PM Views : 563

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మాలల సింహ గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు.అనంతరం ముఖ్య అతిధులుగా మాలమహానాడు జిల్లా అధ్యక్షులు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో కన్వీనర్ సాధు నర్సింగరావు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ కడారి కుమార్ పాల్గొని మాట్లాడుతూ... డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాలల ఆత్మగౌరవం కోసం తమ ఉనికి కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కావున మాలల సింహ గర్జనకు మాల కుల బంధవులు మేధావులు, మహిళలు విద్యార్థులు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.మాలల ఐక్యాత సాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ముఖ్య సలహాదారులు ప్రముఖ న్యాయవాది మోటూరి రవి జిల్లా సహాయ కార్యదర్శి అమలాకర్ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శంకర్ మాల మహానాడు దుగ్గొండి మండల అధ్యక్షుడు ఈద విజేందర్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి దుగ్గొండి మండల కన్వీనర్ కోడి కృష్ణకర్ నెక్కొండ మండల కన్వీనర్ కారు కరుణాకర్ చెన్నారావుపేట మండల కన్వీనర్ కడగండ్ల యాకయ్య నాయకులు కంచరదాసురాజు భూపెల్లి ప్రసాద్ కనుకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :