ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నిజం కళాశాల హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు కళాశాల ప్రిన్సీపాల్ ఉస్మానియా విసి విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే విద్యార్థులు న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఒక్క సరిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ నాయకులు కార్యాలయంలోకి వెళ్లే అందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాటయూ దారి తీసి వాగ్వధం చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురికి గాయాలు కాగా మిగితా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Admin
Aakanksha News