Tuesday, 22 September 2026 10:17:58 AM

కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం...

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

Date : 12 February 2024 06:34 PM Views : 409

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండలో మీడియా తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే మేమే తరిమామని, ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందన్నారు. కృష్ణా జలాల సాధన కోసం రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ సభ నిర్వహించనుందని.. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా హాజరవుతారన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :