Friday, 25 September 2026 11:18:19 PM

మార్చి 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మె

కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు.

Date : 17 February 2023 03:22 PM Views : 686

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం గోదావరిఖని 5inc వద్ద జరిగింది.ఈసమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కౌశిక హరి, బుర్ర తిరుపతి,వేల్పుల కుమారస్వామి, ఏ.వెంకన్న ,తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ.. ఓబి కాంట్రాక్టు కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని అన్నారు. చట్ట ప్రకారము వీరికి రావలసిన హైపర్ కమిటీ వేతనాలు అమలుపరచడం లేదని. అనేకసార్లు నోటీసులు ఇచ్చి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఓబి యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయని వారు మండిపడ్డారు.ఈస్థితిలో రామగుండం రీజియన్ లో ఉన్న ఓబీ కాంట్రాక్ట్ కార్మికులంతా నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని మార్చి 6 తేదీ నుంచి జరిగే నివేదిక సమ్మెలో ఓబి కాంట్రాక్టు కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి జరిగే నిరవేదిక సమ్మెకు ఓబి యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి సమ్మె ప్రచారం కొనసాగించాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :