ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పాఠశాల ఆవరణంలోనే ప్రైవేట్ ఉపాధ్యాయునిపై దాడి చేసిన కానిస్టేబుల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిపై దాడినీ టీపీటీఎఫ్, రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అండగా ఉంటుందని, ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలుస్తుందని అన్నారు.గత 12 సంవత్సరాల నుండి ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్న సంఘం టీపీటీఎఫ్ అని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ పై దాడులు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు.దాడి చేసిన పోలీస్ నీ వెంటనే విధుల నుండి బహిష్కరించాలని, బహిరంగంగా ఉపాధ్యాయుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చోరవ తీసుకొని విచారణ చేసి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాలోని ఉపాధ్యాయులతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆవుల రాజేష్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News