ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. హరీష్‌రావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో తప్పుడు వివరాలను వెల్లడించాడని చక్రధర్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. మంగళవారం చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. హరీష్‌రావు తరుఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్ ఎలాంటి ఆధారాలు నిరూపించకపోవడంతో న్యాయస్థానం.. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
Admin
Aakanksha News