Monday, 10 August 2026 05:11:03 PM

యాదాద్రి ఆలయానికి పెరిగిన భక్తుల తాకిడి

చివరి కార్తీకమాసం కావడంతో పోటెత్తిన భక్తులు

Date : 20 November 2022 12:05 PM Views : 503

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడితో కీటకీటలాడుతుంది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆదివారం చివరి కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు.పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయం వీధుల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం నుండి ఉచిత దర్శన క్యూ కాంప్లెక్స్‭లో భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :