Friday, 11 July 2025 04:52:07 AM

ఎమర్జెన్సీ..విదించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ పార్టీ

భారత్ సురక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు సి అశోక్ కుమార్ యాదవ్

Date : 25 June 2025 08:26 PM Views : 88

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం, ఎమర్జెన్సీ.. విదించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ పార్టీ అని భారత్ సురక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు సి అశోక్ కుమార్ యాదవ్ విమర్శించారు.ఈరోజు ఎమర్జెన్సీ.. విదించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా యావత్తు దేశంలో ప్రభుత్వ నిరంకుశ పాలన వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేసారు. . ఈరోజు 50 సంవత్సరాలు కిందట 1975 జూన్ 25 నాడు రాత్రి 12 గంటలకు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ నాయకులకు మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని నిషేధించడం జరిగింది . ఆనాటి రాజకీయ నాయకులలో అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీ మురళీ మనోజ్ చేసి నాన్న ఈ దేశం నానాజీ దేశముఖ్ జార్జ్ ఫర్ నాన్ ఇస్ మధులిమియే మొరార్జీ దేశాయి చౌదరి చరణ్ సింగ్ రాజనారాయణ ఇంకా కొన్ని రాజకీయ పార్టీ నాయకులకు అరెస్టు చేయడం జరిగింది అరెస్టు అనంతరం లక్షణాదిమంది కార్యకర్తలు అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సి అశోక్ కుమార్ యాదవ్ ,నగర అధ్యక్షులు ఠాకూర్ యమన్సింగ్, మరియు నగర కార్యవర్గము జైలుకెళ్ళిన కార్యకర్తలకు ముదిరాజ్ సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి ,మరియు లక్ష్మీ, వీరికి ఘనగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో జ్యోతి బాల ప్రసాద్ ,నరసింహారావు ,రమేష్ , కేశవ్ ఉదయ్ కృష్ణ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :