Wednesday, 12 February 2025 03:06:53 AM

నక్సలైట్ పేర్ల మీద అమాయక ఆదివాసీలను కాల్చి చంపుతున్న బీజేపీ ప్రభుత్వం...

సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

Date : 18 January 2025 07:01 AM Views : 117

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : బీజాపూర్ పరిదిలో నక్సల్స్ పేరు మీద 12 మంది అమాయక ఆదివాసీలను కేంద్ర సాయుధ బలుగలు కాల్చి చంపి ఎన్కౌo టర్ అనడం ఇది కొత్తేమీ కాదని ఈ బూటకపు ఎన్కౌంటర్ ను సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ నేడొక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అఖండ హిందూ దేశం అంటూ భారత దేశంలోనే అత్యంత హిందూ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశం లో దళిత,మైనార్టీ,ఆదివాసీ, ముస్లిం లపై దాడులు చేస్తూ గార్ వాపసు పేరుతో దేశాన్ని అల్లకొల్లం చేస్తూ,మరో పక్క దేశ సహజ సంపద అంతా పిడికెడు మంది చేతిలో పెడ్తూ పెద ప్రజలను కందిషికులుగా మార్చి వేసి,ప్రపాలనను గాలికొదిలి వారి అంతిమ లక్ష్యం అఖండ హిందూ భారత్ కోసం పనిచేస్తూ,అడివికి , ఈ దేశానికి ములపురుషులైన ఆదివాసీలను నక్సలైట్ ల పెర్ల మీద వారిపై యుద్ధం ప్రకటించి వారిని అంతం చేస్తామనడం స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే స్వయంగా ఈ కాగార్ "అప రెస్షన్ ను నడిపించడం దుర్మార్గమని సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు.ఈ బూటకపు ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి అమాయక ఆదివాసీల మరణాలకు కారణమైన వారిపై హత్య నేరం మోపి కఠినంగా శిక్షచాలని డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు