Thursday, 24 September 2026 08:52:35 PM

ప్రజల వద్దకే పాలన...ప్రజసౌమ్య తెలంగాణ...

రామగుండం నియోజక వర్గ ప్రజల తీర్పు మరువలేనిది... గత పాలనలో రామగుండం అవినీతి మయంగా మారింది... ప్రజల సహకారంతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తా...రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్..

Date : 06 January 2024 12:13 PM Views : 827

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజల వద్దకే పాలన...ప్రజసౌమ్య తెలంగాణను ప్రజలకు తీసుక వచ్చామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 202 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 2 లక్షల 23వేల 432 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం దళారులతో సంబంధం లేకుండా ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నిరుపేద లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి లేకుండా నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ పాలన అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం రామగుండం నియోజకవర్గం వైపు చూసే విధంగా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు మరువలేనిదని ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. రామగుండం నియోజకవర్గం మొత్తం గత పాలనలో అవినీతిమయంగా మారిందని ఐదేళ్ల పాలనలో కనీసం ఎమ్మార్వో కార్యాలయాన్ని కూడా నిర్మించ లేక పోయారని విమర్శించారు. గత పాలకులు రామగుండంను సమస్యల గుండగా మార్చి గోదావరిఖనిని బొందల గడ్డగా చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చే సమయంలో సోనియాగాంధీ 60వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇస్తే గత గడిల పాలనలో 7వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం అప్పు చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :