ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నర్సంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటమండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం రోజు మండల పరిధిలోని పల్కపల్లి శివాలయ ప్రాంగణంలో కార్తీక వన సమారాధన వైశ్యుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవం ఘనంగానిర్వహించారు.ఈసందర్భంగా ఉసిరి చెట్టుకు భక్తి శ్రద్ధల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జబర్దస్త్ టీం చే ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం,నిర్వహించారు. అచ్చంపేటమండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట లక్ష్మీనారాయణఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్యమహాసభ విద్యా కమిటీ చైర్మన్,శ్రీశైలం,అన్న సత్రం చైర్మన్ మిడిదొడ్డి. శ్యాంసుందర్ , నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభఅధ్యక్షులుబచ్చు.రామకృష్ణ,రాష్ట్ర మహాసభ కార్యదర్శివిసనకర్రల చంద్రకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్మి చర్ల రమేష్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్. చిక్కుడు అనురాధ మున్సిపల్ చర్మన్ శ్రీనివాస్ ,మహాసభ రీజనల్ చైర్మన్ , వాసవి కన్యకా పరమేశ్వరిటెంపుల్ చైర్మన్ కొరివి. శేఖర్, జూలూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీధర్, కోశాధికారి, సంబు వెంకటరమణ వేణుగోపాల్,శ్రీనివాస్,బంధం,బాలకృష్ణ, వెంకటేష్, జిల్లా పిఆర్ఓ మిర్యాల రాజయ్య, ఉప్పు. ఆంజనేయులు, మేడిశెట్టి సురేష్,, ఆకుతోట ప్రవీణ్, నరసింహ, విజయకుమార్, తోపాటు ఆర్యవైశ్య సంఘంనాయకులు మహిళలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు. ముఖ్య అతిథులను శాలు వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్తీక మాసం ఆరంభం నుంచి ప్రతీ ఒక్కరూ భగవంతుని పై భారం వేసి అందరూ కలిసి సంతోషంగా ఉండాలనీ కార్తీక మాసం అంటే దేవుళ్ళకు ఎంతో ప్రీతి కరమని ఈ మాసంలో చేస్తున్న ప్రత్యేక పూజల ఫలితంగా ప్రతి ఒక్కరూ కలిసి ఆనందంగా ఉండాలని మాసం చివరిలో వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే నేడు మండల ఆర్యవైశ్య సంఘంఆధ్వర్యంలోకార్తీక మాస వైశ్య వనభోజనాల ఆత్మీయసమ్మేళనం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రముఖ జబర్దస్త్ టీం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను చేశారు. మారిందిచేస్తున్న ఈ సందర్భంగా సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన చిన్నారులకు బహుమతుల ప్రధానం అనంతరం సామూహిక వన భోజనాలు చేశారు. కార్యక్రమం లో వైశ్య సంఘంలో ఉన్న అన్ని విభాగాలప్రతినిధులుమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Aakanksha News