Tuesday, 11 August 2026 05:43:35 PM

రాజకీయ పునరావాస కేంద్రంగా TSPSC

NSUI జిల్లా కార్యదర్శి మెంటం ఉదయ్

Date : 19 March 2023 07:47 PM Views : 662

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : TSPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని NSUI నాయకులు విమర్శించారు. ఈ మేరకు TSPSC ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ , SY థామస్ ల పిలుపు మేరకు ఆదివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో NSUI జిల్లా కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ అద్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పలువురు NSUI నాయకులు మాట్లాడుతూ TSPSC పేపర్ లీకేజ్ విషయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే భర్త రఫ్ చేయాలని లీకేజీ కుట్రకు పాల్పడిన దోషులను ఈ వ్యవహారానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.లీకేజీకి సంబంధించి నిందితులను వారి వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే MLC కవిత లిక్కర్ స్కాం కేసులో ఈడి విచారణ జరుగుతుంటే తెలంగాణ ప్రజలందరికి అవమానం అని చెప్పి ఇప్పుడు సర్వర్ హ్యాకింగ్ వల్ల పేపర్ లీకేజీ ఐతే IT మినిస్టర్ నాకు సంబంధం లేదని చెప్పటం నిజంగా సిగ్గుచేటు వారు మండిపడ్డారు.TSPSC ప్రశ్నా పత్రాలు ఎలా లీక్ అయ్యాయో చైర్మన్,సీఎం ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని అన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. TSPSC ప్రశ్నా పత్రాలు దాచిన స్ట్రాంగ్ రూమ్‏లోకి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారు. ఇది సీఎం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం అని ఆరోపించారు. TSPSC ఉనికి ప్రశ్నర్ధకంగా కనిపిస్తోందని. లీకేజీల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శలు చేసారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం నిర్వహించిన అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జ్‏తో విచారణ జరిపించాలని ఉదయ్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు వంశీ,వాసు, శ్రీరామ్,శ్రీమాన్,వినయ్, సుమంత్,నాని,శివ, నాగరాజ్ , అఖిలేష్,రాకేష్, హరిప్రసాద్, శ్రవణ్ , రికీ , జాన్ , అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :