Saturday, 18 January 2025 10:29:04 AM

సంపద సృష్టిస్తున్న బీసీ కులాలకు బడ్జెట్ కేటాయింపులో అరకొర నిధులు...

సామాజిక స్ఫూర్తికి విరుద్ధం.. బీసీ సేన నిప్పులు

Date : 12 February 2024 06:30 PM Views : 105

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : బడ్జెట్ కేటాయింపులో అరకొర నిధులు కేటాయించడం సామాజిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ విమర్శించారు. విద్యానగర్ లోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ మాది వాస్తవిక బడ్జెట్ అని చంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి , 60 శాతం జనాభాగలబీసీలకు కేవలం ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే సరిపోతుందా ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పు అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి నియోజకవర్గం లో బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి వస్తే ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ లో బీసీల అభివృద్ధికి 20 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ వార్షిక బడ్జెట్ కేవలం ఎనిమిది వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం , ఏడాదిపాటు బీసీల అభివృద్ధికి, బీసీ గురుకులాల భవన నిర్మాణాలకు ఏ మూలకు సరిపెపోదని రాష్ట్ర తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఉపకార వేతనాలు మరియు ఫీజు రియంబర్మెంట్ బకాయిలతోపాటు, ఇచ్చిన హామీ మేరకు 20 వేల కోట్ల అదనపు.బడ్జెట్ కేటాయించాలనిడిమాండ్ చేసారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటి రూపాయల నిధులతో పూలే భవన్ నిర్మించాలని కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానేహామీలతోనే బీసీల ఓట్లు లాక్కోవాలని చూస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కరాటే ఎతినే చెన్నయ్య,వెంకటేష్ యాదవ్,బాలస్వామి, సెలేటి వెంకటేష్,గొడుగు నర్సిములు, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు