ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : మొదటి దశలో ఎంపికైన మన ఊరు మన బడి పాఠశాలల్లో పెండింగ్ పనులను రెండు వారాలలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ రామగుండంలో మునిసిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి రామగుండం, పాలకుర్తి, అంతర్గం మండలాలలో మన ఊరు మనబడి కింద ఎంపికైన పాఠశాలల్లో పనుల పురోగతిపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, వర్కింగ్ ఏజెన్సీలతో, సంభందిత అధికారులతో సమీక్షించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ.. మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి దశలో ఎంపికైన పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్ ఉన్న చిన్న, చిన్న పనులను త్వరితగతిన పూర్తి చేసే ప్రారంభానికి సన్నద్దం చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అనంతరం రామగుండం నియోజకవర్గం లోని స్కూల్స్, కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమావేశము ఏర్పాటు చేసి ప్రతి కాలేజీలోనూ, స్కూళ్లలోనూ ఈ ఎల్ సి క్లబ్బులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, రామగుండం మున్సిపల్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఏ.ఈ.లు, డి.ఈలు, ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News