ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఆర్.ఎం.పీ వైద్యుడు వేసిన ఇంజక్షన్ వికటించి రవళి అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోంది. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన రవళి (15)లు అనే విద్యార్థి గత కొంతకాలంగా రక్తస్రావం తో బాధపడుతుంది. ఈ క్రమంలో ధర్మారం మండలం దొంగతిర్తి గ్రామంలోని వారసంత మార్కెట్ కు కూరగాయల కోసం తన తల్లి తో కలసి వెళ్లగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైనా రవళిని స్థానిక ఆర్ఎంపి డాక్టర్ శంకర్ దగ్గరకు తీసుకవేళ్లగా పరీక్షించిన డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇంజక్షన్ వేసిన అరగంట వ్యవధిలో రవళి మృతి చెందింది.దీంతో రవళి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Admin
Aakanksha News