Monday, 10 August 2026 04:10:01 PM

66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల

Date : 28 March 2025 05:51 PM Views : 548

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్ గ్రేషియాను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామక్రిష్ణా రావుతో సమన్వయము చేసి నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయినవని వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షలు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :