Thursday, 25 June 2026 07:43:54 PM

ట‌కీట‌కీమ‌ని రాహుల్ గాంధీ ఖాతాలో ప‌డుతున్నాయో చూడాలి... మిగులు బడ్జెట్ రాష్టాన్ని అప్పుల రాష్టంగా మార్చారు..

దివాళ‌కోరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. ఆగం చేస్తున్నారు...కేటీఆర్

Date : 22 February 2025 04:55 PM Views : 730

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : 4300 కోట్లు ఎక్క‌డ పోతున్నాయి...ట‌కీట‌కీమ‌ని రైతుబంధు ప‌డుత‌లేదు. తులం బంగారం వ‌స్త‌లేదు.. మరి ట‌కీట‌కీమ‌ని రాహుల్ గాంధీ ఖాతాలో ప‌డుతున్నాయో చూడాలి... అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో సైటర్లు వేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ...అప్పుల‌కు వడ్డీలను నెల‌కు రూ. 6500 కోట్లు క‌డుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో తెలిపారని నేను చెప్పింది త‌ప్ప‌యితే ఏ శిక్ష‌కైనా సిద్ధమని వడ్డీలకు పోయిన ప‌ది నెల‌ల‌కు 22 వేల 56 కోట్లు క‌ట్టిన‌ట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. నెల‌వారీ లెక్క కూడా ఇందులో ఇచ్చారు.. నెల‌కు పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జ‌న‌వ‌రి వ‌ర‌కు 22 వేల 56 కోట్లు. అంటే నెల‌కు 2200 కోట్లు అని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. మ‌రి నెల‌కు 6500 కోట్లు క‌డుతున్నాని బోగ‌స్ ముఖ్య‌మంత్రి ఎలా చెప్తారని ప్రశ్నించారు.ముఖ్య‌మంత్రి ఇన్ని ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్తాడ‌ని ఎవ‌రు అనుకోరని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ చెప్పిన ప‌చ్చి అబ‌ద్దాల‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఎండ‌గ‌ట్టి ఉతికి ఆరేశార‌ని కేటీఆర్ తెలిపారు. ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ట్టు మీరు విడుద‌ల చేసిన నివేదిక‌నే తెలియజేస్తున్నాయని మ‌రి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన ఈ సంవత్సర కాలంలో ఏం చేశావంటే.. రేవంత్‌కు చెప్పేందుకు సమాధానం లేదన్నారు.బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే సమయంలో రేష‌న్ కార్డుల సంఖ్య‌ 89 ల‌క్ష‌ల 97 వేలు అని భ‌ట్టి విక్ర‌మార్క‌నే వెల్లడించారని మ‌రి కొత్త‌గా ఏమ‌న్న ఇచ్చారంటే.. ఏది లేదని ల‌క్ష కార్డులు తొల‌గించామ‌ని చెప్పారని కొత్త‌వి ఇవ్వ‌కుండా ఉన్న‌వి తీసివేశారని కేటీఆర్ తెలిపారు.దివాళ‌కోరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే.. వీరి అస‌మ‌ర్థ పాల‌న‌లో తెలంగాణ చేతికి చిప్ప వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.కొత్త పథకాలు అమలు చేయలేదు.రైతుబంధు లేదు, రుణ‌మాఫీ లేదు, స్కూటీలు, తులం బంగారం లేవు, పెన్ష‌న్లు లేవు.. మ‌రి ఎందుకు ఖ‌ర్చు పెరిగింది.. ఎందుకు అప్పు చేస్తున్నారో చెప్ప‌గ‌ల‌రా..? మీకు మిగులు బ‌డ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్ప‌జెప్పితే ఒక ఏడాదిలో ఒక ల‌క్షా 41 వేల కోట్లు అప్పు ఎందుకు చేసారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తుగ్ల‌క్ నిర్ణ‌యాల వ‌ల్ల హైడ్రాతో రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని రిజిస్ట్రేష‌న్లు త‌గ్గాయని. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి పొడిచిన వెన్నుపోటు కార‌ణంగా ఎంతో మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డికి రాజ‌కీయ క‌క్ష‌లు తెలుసు త‌ప్ప రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగు చేయాల‌నే సోయి లేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి వ్య‌వ‌సాయాన్ని చావుదెబ్బ కొట్టి వ్య‌వ‌సాయంను సంక్షోభంలోకి తీసుకవెళ్లారని పంట‌లు ఎండిపోయే ప‌రిస్థితి వచ్చిందని కేసీఆర్ మీద కోపంతో మేడిగ‌డ్డ రిపేర్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెల్లారి లేస్తే... మాజీ ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప వేరే ఆలోచన లేదని ఎప్పుడు చూసిన కేసీఆర్ ను తిడుతూ ఉంటడు కానీ రాష్టాన్ని ఏలా అభివృద్ధి చేయాలో ఆలోచన లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ను తిట్టడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు.లేదంటే ఇక మీదట మేము కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ధ్వజమెత్తారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :