ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం రీజియన్ లోని జీడీకే-2వ గనిలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మైనింగ్ సర్దార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... జీడీకే-2వ లో టబ్బులో బొగ్గును లోడ్ చేసి తరలిస్తున్న క్రమంలో ఒక్క సరిగా లింక్ తెగి పోవడంతో మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి చేతులు, కళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా చికిత్స నిమిత్తం సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మరో 7గురు కార్మికులు ఉండగా వారు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాయాలైన మైనింగ్ సర్దార్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
Admin
Aakanksha News